డంపింగ్‌ యార్డుతో కరీంనగర్‌ ప్రజల ఆరోగ్యానికి ముప్పు

నగరానికి దూరంగా తరలించాలి.. బయోమైనింగ్‌తో వ్యర్థాలను తొలగించాలి: తెలంగాణ రక్షణ సేన కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): కరీంనగర్‌ నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని బైపాస్‌ రోడ్డులోని డంపింగ్‌ యార్డును వెంటనే నగరానికి దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తతో డంపింగ్‌ యార్డు సమస్యగా మారిందని, జనావాసాలకు దూరంగా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు. తెలంగాణ రక్షణ సేన కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అంకం...