ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్ అందించాలి: కలెక్టర్ కె. హైమావతి
సిద్ధిపేట, జూలై 31(చైతన్యగళం): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఆగస్టు 15 నాటికి ఒక జత యూనిఫామ్ తప్పనిసరిగా అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య భవనంలో స్కూల్ యూనిఫామ్ కుట్టింపు కార్యక్రమంలో భాగంగా క్లాత్ కటింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్గల్ మండలంలోని 3,830 మంది విద్యార్థులకు యూనిఫామ్‌ల తయారీ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన...