Sunday, September 13, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, జూలై 25 (చైతన్యగళం):
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నందికొట్కూరు మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని ప్రార్థించి తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని కోరుకున్నారు.తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!