వరంగల్, జూలై 21 (చైతన్యగళం):
ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిమిత్తం హనుమకొండకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శాలువా కప్పి సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేశారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
