అనుమతులు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
యాచారం, జులై 20 (చైతన్యగళం) : ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో యూనిఫాంలు, పుస్తకాల దందా అరికట్టాలని యాచారం మండల ఎంఈవోకు వినతిపత్రం అందజేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన నేత ముత్యాల మనీష్ పటేల్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో యూనిఫాంలు, పుస్తకాల పేరుతో జరుగుతున్న అక్రమ దందాను అరికట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మండల విద్యాశాఖ అధికారి...