CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:56 pm Posted by : CHAITHANYA GALAM NEWS

బీఆర్ఎస్ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

హుస్నాబాద్, జూలై 15 (చైతన్యగళం): బీఆర్ఎస్ పార్టీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సతీష్ కుమార్ మాట్లాడుతూ, “ప్రజాసేవలో మరింత చురుకుగా ముందుకు సాగాలి. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలి” అని ఆకాంక్షించారు. శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మండల సురేందర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ బలోపేతం, మండల అభివృద్ధి, ప్రజా సమస్యలపై నాయకులు చర్చించారు.