ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో రాజకీయ పార్టీల సహకారం అవసరం
కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచన కరీంనగర్, జూన్ 23 (చైతన్యగళం): ఓటర్ జాబితాను పకడ్బందీగా, పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో బీఎలఏలు, రాజకీయ పార్టీలు పూర్తి...