Wednesday, July 22, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతవిరాట పర్వం పఠించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు

విరాట పర్వం పఠించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు

📰 Generate e-Paper Clip

నందికొట్కూరు, జూలై 19 (చైతన్యగళం):
స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మహాభారతంలోని విరాట పర్వంను పఠించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విరాట పర్వానికి మహాభారతంలో విశిష్ట స్థానం ఉంది.

దీనిని పఠించడం ద్వారా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని విశ్వాసం ఉంది. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు పుష్కల వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ‘సమస్త లోకాః సుఖినో భవంతు’ అనే సంకల్పంతో విరాట పర్వం పఠించాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ భక్తులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!