Tuesday, July 7, 2026
Homeతెలంగాణకరీంనగర్పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్ జూలై 6 (చైతన్య గళం):

కరీంనగర్ రూరల్ మండలంలోని శాతవాహన కాలనీలో డీటీఆర్ ఏర్పాటు, విద్యుత్ లైన్ నిర్వహణ పనుల కారణంగా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు రూరల్ ఏడీఈ గడం రఘు తెలిపారు.

ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, పాతవాడ, కొత్తవాడ, హనుమాన్ నగర్, సాలేనగర్, వి పార్క్ వెనుక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

అలాగే మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సమ్మక్క గద్దెలు, కంటి ఆసుపత్రి ప్రాంతం, ఇందిరమ్మ కాలనీ, స్వామి కాలనీ, షేకాబ్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు

విద్యుత్ వినియోగదారులు ఈ తాత్కాలిక అంతరాయానికి సహకరించాలని రూరల్ ఏడీఈ గడం రఘు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!