Sunday, November 22, 2026
Homeతెలంగాణచిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

📰 Generate e-Paper Clip

ఇబ్రహీంపట్నం, నవంబర్‌ 22 (చైతన్యగళం): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మునగనూరులో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించవచ్చని తెలిపారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఐదేళ్లలోపు చిన్నారులు ఎవరూ పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని సూచించారు. పోలియో నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!