-
కుంకుమ పూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు
కోహెడ, సెప్టెంబరు 24 (చైతన్యగళం): ఇందిరమ్మ కాలనీ గ్రామంలో మాదాసు సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక మండపం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు కుంకుమ భరణి, గాజులు, ప్రసాదాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇందిరమ్మ కాలనీ గ్రామపంచాయతీ సర్పంచ్ గడ్డం రచన చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలు, భక్తులకు శ్రీ వరసిద్ధి వినాయక మండప సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు.
