Tuesday, September 22, 2026
Homeతెలంగాణగణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్‌ఐ శ్వేత

గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్‌ఐ శ్వేత

📰 Generate e-Paper Clip

కొత్తపల్లి, సెప్టెంబరు 22 (చైతన్యగళం): వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి రూరల్‌ ఎస్‌ఐ శ్వేత మంగళవారం కొత్తపల్లి గ్రామంలోని పలు గణేష్‌ మండపాలను సందర్శించారు. అనంతరం నిమజ్జనం నిర్వహించనున్న ఊర చెరువును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్వేత మాట్లాడుతూ.. నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసుల సూచనలు పాటించాలని, డీజేలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామ యువత పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమంలో విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ చిన్నయ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!