Saturday, September 5, 2026
Homeతెలంగాణకరీంనగర్సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

📰 Generate e-Paper Clip

రామగుండం, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ శుక్రవారం అంతర్గాం మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.

మండలంలోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని కోరారు.

సమావేశంలో ప్రభుత్వ అధికారులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!