Monday, August 17, 2026
Homeతెలంగాణసూర్యలక్ష్మి కాటన్ మిల్‌ ఆవరణలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సూర్యలక్ష్మి కాటన్ మిల్‌ ఆవరణలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ఆమనగల్(చైతన్యగళం): సూర్యలక్ష్మి కాటన్ మిల్‌ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంగళి ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు.

జాతీయ పతాకానికి వందనం చేసిన అనంతరం కార్మికులు దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి స్ఫూర్తిని చాటారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

కార్మికుల భాగస్వామ్యంతో ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు కొనసాగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కార్మికులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు,ఐఎన్టీయూసీ ప్రతినిధులు పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యనాయక్, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శివలింగం, ఎంపీపీ విజయ్, బ్లాక్‌ కాంగ్రెస్‌ నాయకుడు యాట నర్సింహ, కోఆప్షన్‌ సభ్యుడు ఖాదర్,ఐఎన్టీయూసీ నాయకులు గోపాల్, శ్రీను, రాజు, గోపి, రాగ్య, కాంగ్రెస్‌ నాయకులు కృష్ణనాయక్, ఫరీద్, శ్రీకాంత్, కరీం, హలీం, సురేష్, నాజర్, శీను, వెంకటరెడ్డి, వెంకట్, కండె సాయి, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!