Wednesday, August 5, 2026
Homeతెలంగాణపెద్దపల్లిలో మహిళలకు షీటీమ్ అవగాహన సదస్సు

పెద్దపల్లిలో మహిళలకు షీటీమ్ అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి(చైతన్యగళం):
మహిళలభద్రత, సైబర్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించిన పోలీసులు
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి లోని వీ-హబ్ (WE HUB) ట్రైనింగ్ సెంటర్‌లో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా షీటీమ్ ఇన్‌-చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ మహిళలభద్రత, పోక్సోచట్టం,సోషల్ మీడియా ప్రభావం, వ్యక్తిగత భద్రత, ఆన్‌లైన్ మోసాల నివారణ,యాంటీ డ్రగ్స్ వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళల భద్రత కోసం షీ టీమ్ ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జన సమ్మర్థ ప్రాంతాలు, విద్యా సంస్థల పరిసరాల్లో నిరంతరం నిఘా నిర్వహిస్తోందని తెలిపారు.ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులను వేధింపులకు గురి చేస్తే భయపడకుండా వెంటనే షీటీమ్ మొబైల్ నంబర్ 6303923700కు సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.అత్యవసర పరిస్థితులు లేదా బెదిరింపులు ఎదురైనప్పుడు వెంటనే 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని,సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 హెల్ప్‌ లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు తమ ప్రయాణాలను మరింత సురక్షితంగా చేసుకునేందుకు T-Safe Appను వినియోగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీటీమ్ సభ్యులు సురేష్, మౌనిక,స్నేహలత తో పాటు వీ-హబ్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!