Wednesday, July 29, 2026
Homeతెలంగాణదుర్గాభవానీ అమ్మవారికి బెండకాయల మాలలతో విశిష్ట అలంకరణ

దుర్గాభవానీ అమ్మవారికి బెండకాయల మాలలతో విశిష్ట అలంకరణ

📰 Generate e-Paper Clip

కరీంనగర్ రూరల్ , జూలై 27 (చైతన్యగళం): కరీంనగర్ నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో నిర్వహిస్తున్న ఆషాఢమాస శాకంబరీ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం 13వ రోజు శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని బెండకాయల మాలలతో విశిష్టంగా అలంకరించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పవన్‌కృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విశేష హారతులు సమర్పించారు. బెండకాయల మాలలతో అలంకరించిన అమ్మవారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటీ సభ్యులు, బాధ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలను పొందారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!