- ఆమనగల్లులో రాస్తారోకో..
- మోదీ దిష్టిబొమ్మ దహనానికి యత్నం
- పోలీసులతో తోపులాట
ఆమనగల్లు, జూలై 22 (చైతన్యగళం):
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బుధవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వారి శివలింగంతో కలిసి భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడంతో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలపై దాడి అని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపుతోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీపతి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ మండ్లి రాములు, కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాదర్, మాజీ ఎంపీపీ అనిత విజయ్, ఒగ్గు మహేష్, సీనియర్ నాయకుడు ఖాదర్ ఖాద్రి, కాలే మల్లయ్య, రాగ్య నాయక్, షర్ఫుద్దీన్, శ్రీపాల్, ఎంగలి ప్రసాద్, అబ్దుల్ అలీమ్, సూదిని కొండల్ రెడ్డి, కండె సాయి, శ్రీధర్ నాయక్, వార్డు సభ్యుడు జగన్, రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఫరీద్, గౌస్, కృష్ణ యాదవ్, సురేష్ నాయక్, దేవరశెట్టి మహేష్, అంజాత్, నాజర్, శీను నాయక్, రైమ్, కృష్ణ కుమార్ గౌడ్, రఫీ, శివ, గోపాల్, మాల్య, పత్య పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
