సాయాజీ సీడ్స్‌తో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి

రైతు కమిషన్‌ను ఆశ్రయించిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులు హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (చైతన్యగళం): సాయాజీ సీడ్స్‌ కంపెనీ విత్తనాలతో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన రైతులు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఆశ్రయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రైతు కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, సభ్యులు కే.వీ.ఎన్‌.రెడ్డి, గోపాల్‌రెడ్డిలను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2024–25 సంవత్సరంలో కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్ల సూచనల మేరకు సంకరజాతి వరి విత్తనాలను సాగు...