దాడులతో బీజేపీని భయపెట్టలేరు
ప్రజల కోసం మా పోరాటం ఆగదు: సిరికొండ బలరాం ములుగు , సెప్టెంబర్ 1(చైతన్యగళం): బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ విద్యార్థులు, రైతులు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతోందన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న నాయకులు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై దాడులకు పాల్పడటం అమానుషమని మండిపడ్డారు. “దాడులతో బీజేపీని...