వివాహం నుంచి వస్తుండగా విషాదం.. బావిలో పడిన కారు
భీమదేవరపల్లి, ఆగస్టు 27 (చైతన్య గళం): వివాహ వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న కుటుంబ సభ్యుల కారుకు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం రాంనగర్ (మంగళపల్లి) శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్‌కు చెందిన ఏలూరి రవీందర్‌రెడ్డి, ఏలూరి వీరారెడ్డి, చిట్టి కిరణ్, ఏలూరి రాధ (61) హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలోని శుభం...