టాస్, ఉల్లాస్ లక్ష్యాల సాధనకు శాఖల సమన్వయంతో కృషి
అర్హులందరికీ విద్యావకాశాలు.. నిరక్షరాస్యత నిర్మూలనకు సమష్టి కార్యాచరణ మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS), ULLAS–నవ భారత్ సాక్షరత కార్యక్రమాల లక్ష్యాలను వందశాతం సాధించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో TOSS, ULLAS కార్యక్రమాల అమలుపై కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, అక్షరాస్యత కార్యక్రమాల అమలులో శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి పురోగతిపై చర్చించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అల్వాల సత్యనారాయణ...