పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, ఆగస్టు 1 (చైతన్యగళం): నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం పరిశీలించారు.మొదటగా పెద్ద సూరారం గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను సమీక్షించి, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మంత్రి మాట్లాడుతూ, “గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.20,000 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల నిర్మాణ పనులు...