ఘనంగా సీతల భవాని ఉత్సవాలు
కరీంనగర్, జూలై 28 (చైతన్యగళం): మానేరు శివారులో బంజారాల ఆరాధ్య దైవం సీతల భవాని మాత వార్షిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గిరిజనుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఉత్సవాల్లో గిరిజన నాయకులు నూనావత్ అనసూయ భాయ్, కాంగ్రెస్ నేత...