CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:18 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా సీతల భవాని ఉత్సవాలు

కరీంనగర్, జూలై 28 (చైతన్యగళం):
మానేరు శివారులో బంజారాల ఆరాధ్య దైవం సీతల భవాని మాత వార్షిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గిరిజనుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఉత్సవాల్లో గిరిజన నాయకులు నూనావత్ అనసూయ భాయ్, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కార్పొరేటర్ భాస్కర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు శ్రావన్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, నేత ఇప్ప శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం బంజారీలతో కలిసి నృత్యం చేసి ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్, గిరిజన నాయకులు గూగులోతు రాజు నాయక్, ధారావత్ తిరుపతి నాయక్, గూగులోతు లక్పత్ నాయక్, గూగులోతు రవి, రామ్ చందర్ నాయక్, భాస్కర్ నాయక్, రామ్ దాస్ నాయక్, సదానందం నాయక్, సేవ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.