CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:53 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం

  • రూ.25 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం – ⁠మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్

ఆమనగల్, జూలై 25 (చైతన్యగళం): ఆమనగల్ మున్సిపాలిటీ 6వ వార్డులో గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపాలిటీ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.25 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యుడు పూసల సత్యం, స్థానిక నాయకులు పుల్లయ్య, తోట కృష్ణ యాదవ్, పాషా తదితరులు పాల్గొన్నారు.