ప్యాలియేటివ్ కేర్ సిబ్బంది కన్నీటి గోడు
10 నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు.. ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌కు వినతి మహబూబాబాద్: జూలై 25(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్యాలియేటివ్ కేర్‌లో విధులు నిర్వహిస్తున్న సుమారు 60 మంది ఆయాలకు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ భూక్యా రాజేశ్వరి, ధరావత్ లక్ష్మీ, సంధ్య తదితరులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణతో పాటు పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని...