పెద్దపల్లిలో ఘనంగా దాసరి ఉష జన్మదిన వేడుకలు

పెద్దపల్లి, జూలై 19 (చైతన్యగళం): పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్లో బిసి జేఏసీ చైర్మన్ దాసరి ఉష జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, “నా జన్మదినాన్ని పురస్కరించుకుని యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని సుమారు 30 యూనిట్ల రక్తాన్ని అందించారు. రైతులు ఎల్నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్‌లోని బాహుబలి మోటర్ల ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లను నింపి...