Tuesday, July 21, 2026
Homeతెలంగాణపెద్దపల్లిలో ఘనంగా దాసరి ఉష జన్మదిన వేడుకలు

పెద్దపల్లిలో ఘనంగా దాసరి ఉష జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, జూలై 19 (చైతన్యగళం):
పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్లో బిసి జేఏసీ చైర్మన్ దాసరి ఉష జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, “నా జన్మదినాన్ని పురస్కరించుకుని యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని సుమారు 30 యూనిట్ల రక్తాన్ని అందించారు. రైతులు ఎల్నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్ట్‌లోని బాహుబలి మోటర్ల ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లను నింపి కాలువల ద్వారా సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.ఆమె మరింతగా మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ‘రక్తంతో వ్యవసాయం చేయాలి’ అన్నారు. ఈ రోజు మా యువకులు రక్తదానం చేశారు. ఇకనైనా రైతులకు నీటిని అందించి వారి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాను” అని అన్నారు.కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొని దాసరి ఉషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!