కాళేశ్వరం విషయంలో డ్రామాలు ఆడొద్దని ఈటల హెచ్చరిక
హైదరాబాద్, జూలై 10 (చైతన్యగళం): కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ – “నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు. నాకు తెలంగాణ ఫస్ట్.. తర్వాతే పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం” అని స్పష్టం చేశారు. రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ, ఉత్తర తెలంగాణకు నీళ్ల జంక్షన్ మిడ్ మానేరు అని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులు చేపట్టకుండా ప్రభుత్వం...