సీసీ రోడ్ల నాణ్యత పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి

నందికొట్కూరు (చైతన్య గళం): నందికొట్కూరు పురపాలక సంఘం పరిధిలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, భోజనం వడ్డించే విధానం, అందుతున్న సేవలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.తరువాత పురపాలక సంఘం పరిధిలోని కాలేజీ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు సూచనలు చేస్తూ, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.