మహబూబాబాద్‌లో రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయి దగ్ధం

మహబూబాబాద్, జూలై 7(చైతన్యగళం): మహబూబాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.64.24 లక్షల విలువైన 128.496 కిలోల డ్రై గంజాయిని మంగళవారం చట్టప్రకారం పూర్తిగా దగ్ధం చేశారు. 'ఈగల్' (Elite Action Group for Drug Law Enforcement) ఆదేశాల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి, న్యాయస్థానం అనుమతితో ఈ ప్రక్రియ చేపట్టారు. మహబూబాబాద్ డీఎస్పీ గండ్రాతి మోహన్, సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మెడి...