Saturday, September 26, 2026
Homeతెలంగాణతీగలకుంటపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

తీగలకుంటపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

📰 Generate e-Paper Clip

  • చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: సర్పంచ్‌ స్వర్ణలత

కోహెడ, సెప్టెంబరు 26 (చైతన్యగళం): మండలంలోని తీగలకుంటపల్లిలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు జాలిగాం బాలయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ మ్యాకల స్వర్ణలత–సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె చూపిన ధైర్యం, ఆత్మగౌరవం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో రజక సమాజ అభివృద్ధి, ఆత్మగౌరవం, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రాగుల మహేష్‌, వార్డు సభ్యుడు రేవోజు శంకర్‌, మాజీ సర్పంచ్‌ మ్యాకల చంద్రశేఖర్‌రెడ్డి, రజక సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!