యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించేది క్రీడలే: మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 9 (చైతన్యగళం): యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా సిటీ లెవల్‌ రగ్బీ పోటీలు కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఖేలో ఇండియా–అస్మిత...