యువత పట్టుదలతో కృషి చేయాలి – మంత్రి గడ్డం వివేకానంద
మంచిర్యాల, జూన్ 22 (చైతన్యగళం): యువత ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద పిలుపునిచ్చారు.సోమవారం మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “యువత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేయాలి....