నువ్వు ఒంటరి అయిపోతావ్.. నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల చెలరేగిన ఉద్రిక్తతలు అమెరికా జోక్యంతో సద్దుమణిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై దాడులను కట్టిపెట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తాను స్పష్టం చేశానని సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించానని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘నేను బీబీని (నెత్యన్యాహు) హెచ్చరించా.. తన చర్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నా. మాట వినకపోతే చివరకు ఒంటరిగానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించా’ అని ట్రంప్ మీడియాకు చెప్పారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార...