CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 5:17 pm Posted by : CHAITHANYA GALAM NEWS

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు – అన్నామలై

నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భారీ భద్రతా ఏర్పాట్లపై తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల జరిగిన పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో రీ-ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అయితే ఒక పరీక్ష నిర్వహణ కోసం అంత పటిష్ఠ భద్రత ఎందుకని అన్నామలై ప్రశ్నించారు.

‘ఐఏఎఫ్ విమానాలతో కూడిన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత.. ఏఐ నిఘాతో కూడిన సీసీటీవీల పర్యవేక్షణ.. ప్రవేశానికి ముందు బయోమెట్రిక్, ఫేస్ ఐడీ.. పలు అంచెల తనిఖీలు.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ.. అవును, మీరు చదివింది నిజమే.. ఇవి ఉన్నత-స్థాయి, రహస్య, సైనిక-శ్రేణి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి చేసిన ఏర్పాట్లు కావు. ఇవి జూన్ 21, 2026న జరగనున్న నీట్ రీటెస్ట్ కోసం విద్యా మంత్రిత్వ శాఖ చేసిన ఏర్పాట్లు’ అని ట్వీట్ చేశారు.’లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఒక కీలక పరీక్ష సమయంలో యువ విద్యార్థిపై అదనపు భారాన్ని మోపుతాయనే విషయాన్ని మరచిపోతున్నారు. ఇది మన పరీక్షా వ్యవస్థ మొత్తం ఉద్దేశ్యాన్ని, పరీక్ష ఒత్తిడిని తగ్గించాలనే ఎన్‌ఈపీ 2020 లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యలు సమస్యను పరిష్కరించకపోగా, మరిన్ని ఇబ్బందులు సృష్టించవచ్చు’ అని అన్నామలై పేర్కొన్నారు.