సిపిఎం యువజన సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ఇబ్రహీపట్నం, జూన్ 15 (చైతన్యగళం): ఈనెల 16, 17 తేదీలలో జరగనున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర స్థాయి యువజన సమ్మేళనం విజయవంతం కావాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. యాచారం మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యవర్గ సభ్యులు ఆలంపల్లి జంగయ్య, శాఖ కార్యదర్శులు సిహెచ్ సత్యం, కే. గిరికాంత్, పార్టీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. సమ్మేళనం విజయవంతం కావడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.