CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 2:49 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఎ, శ్రీలంక ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. శ్రీలంక ఎకి 278 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్(101) సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ తిలక్ వర్మ(60) హాఫ్ సెంచరీ చేశాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఎ జట్టుకు శుభారంభం దక్కలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ(14) తీవ్రంగా నిరాశపర్చాడు. మరో విధ్వంసకర బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. దూకుడుగా ఆడుతున్న ప్రియాంశ్ ఆర్య(32) విచిత్రమైన రీతిలో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రుతురాజ్, తిలక్ వర్మ భారీ షాట్లతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆయుశ్ బదోని(24) విఫలమయ్యాడు. సుర్యాంశ్ షెడ్గె(26*), అనుకుల్ రాయ్(1*) నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక ఎ బౌలర్లలో షిరాజ్ 2, చమీకా కరుణరత్నే 1, గరుకా సంకేత్ 1, వానుజా సహన్ 1 వికెట్ పడగొట్టారు.