బడి బాట.. భవిష్యత్తు వైపు తొలి అడుగు
పెద్దలు పనికి.. పిల్లలు బడికి విద్య అనేది ప్రతి చిన్నారి హక్కు. సమాజ పురోగతికి, దేశాభివృద్ధికి అక్షరాస్యతే బలమైన పునాది. అలాంటి విద్యను ప్రతి చిన్నారికి చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమం మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో విద్యా చైతన్యాన్ని నింపుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమైన వేళ, చిన్నారుల అడుగులు అక్షరాల వైపు మళ్లడం ఆనందాన్ని కలిగిస్తుండగా, ప్రతి బిడ్డను బడికి చేర్చాలనే సంకల్పానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలుస్తోంది. వేసవి సెలవుల అనంతరం బడి గంట మోగగానే పుస్తకాల సంచులు...