భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రం కొయ్యగుట్ట మల్లన్న స్వామి దేవాలయం

మెదక్, జూన్ 14 (చైతన్య గళం): భక్తుల కొంగుబంగారంగా పేరుగాంచిన కొయ్యగుట్ట మల్లన్న స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. మెదక్ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, రేగోడ్, పెద్దనర్సాపూర్, గోపాల్‌పేట్, ఎల్లారెడ్డి, మెదక్ పట్టణం తదితర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అదేవిధంగా అమావాస్య, పౌర్ణమి సందర్భంగా వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమ కోరికలు...