కల్వకుర్తిని స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి, జూన్ 17 (చైతన్యగళం): గ్రామీణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ మరో కీలక ముందడుగు వేసింది. భవిష్యత్ ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న కృత్రిమ మేధస్సు , సమాచార సాంకేతికత రంగాల్లో కల్వకుర్తి యువతను తీర్చిదిద్దేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఇండోఫాంట్ గ్లోబల్ ఐఎన్సీ‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో కనీసం...