ప్రజల అవసరాల తీర్చడమే లక్ష్యం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, జూన్ 22 (చైతన్యగళం): ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.పెగడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 68 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, 9 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. వారికి సేవ చేయడం నా...