రాజన్న సిరిసిల్ల జిల్లాలో 108 అంబులెన్స్ సేవల ఆకస్మిక తనిఖీ

అత్యవసర వైద్య సేవల నాణ్యతపై సమీక్ష సిరిసిల్ల, జూన్ 10 (చైతన్యగళం):రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిపి ఉంచిన 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను ప్రోగ్రామ్ మేనేజర్ భూమా నాగేందర్, జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో అందుబాటులో ఉండాల్సిన అత్యవసర వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, పరిశుభ్రత, వాహనాల నిర్వహణ, సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు,...