ఇమ్యూనిటీకి బలం… ఆరోగ్యానికి కవచం

సహజ రోగనిరోధక శక్తి పరిరక్షణలో హోమియోపతి పాత్ర ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి వెనుక మన శరీరంలోని అద్భుతమైన రక్షణ వ్యవస్థ దాగి ఉంది. కోట్లాది సంవత్సరాల జీవ పరిణామ క్రమంలో రూపుదిద్దుకున్న మానవ శరీరం ప్రకృతి ప్రసాదించిన అత్యంత సంక్లిష్టమైన, విశిష్టమైన సృష్టి. శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కణం పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంటే, వాటన్నింటికీ రక్షణ కవచంలా నిలిచేది రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్). వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌లు వంటి హానికర సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని సంరక్షించడం,...