ఆర్టీసీ రిటైర్డ్ మెకానిక్ జక్కుల నాగరాజు కన్నుమూత
నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ షాద్‌నగర్, జూన్ 15 (చైతన్యగళం): రిటైర్డ్ ఆర్టీసీ మెకానిక్, బీసీ జనసేన జాతీయ నియోజకవర్గ అధ్యక్షురాలు జక్కుల జలజ భర్త జక్కుల నాగరాజు సోమవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.నాగరాజు ఆర్టీసీలో మెకానిక్‌గా విధులు నిర్వహిస్తూ షాద్‌నగర్ డిపోలో ఎన్నో సంవత్సరాలు సేవలందించారు. విధి నిర్వహణలో నిబద్ధత, సహోద్యోగులతో సత్సంబంధాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. కొంతకాలం క్రితమే ఉద్యోగ...