బంజారా నాయకుల ముందస్తు అరెస్టు
మర్రిగూడ, జూన్ 16 (చైతన్యగళం): హైదరాబాద్‌లో బంజారా కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు వెళుతున్న మర్రిగూడ మండల బంజారా నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ, “బంజారా హక్కుల కోసం శాంతియుతంగా ధర్నాకు వెళుతుంటే, ఆప్రజాస్వామికంగా అరెస్టు చేయడం దుర్మార్గం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల గొంతును నొక్కేలా వ్యవహరిస్తోందని వారు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పోట్లావత్ రాజేందర్ నాయక్, హరిప్రసాద్, రాంజీ తదితరులు పాల్గొన్నారు.