CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 7:06 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆమనగల్లు పశు వైద్యాధికారిగా పల్లవి

ఆమనగల్లు, జూన్ 09 (చైతన్యగళం): ఆమనగల్లు మండల పశువైద్య శాలలో వైద్యాధికారిగా డా.పల్లవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుంచి ఆమె ఆమనగల్లుకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు తలకొండపల్లి పశువైద్య అధికారి డా. విజయ్ కుమార్ ఇన్ఛార్జ్ గా సేవలందించారు. పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని డా.పల్లవి తెలిపారు.