ముందస్తు ప్రణాళికతో ఖరీఫ్‌కు సన్నద్ధం కావాలి – జిల్లా కలెక్టర్
కరీంనగర్, జూన్ 17 (చైతన్యగళం): జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ, “వాతావరణ మార్పుల సవాళ్లను తట్టుకుని రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించి, నికర ఆదాయాన్ని పెంచేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలి” అని సూచించారు. తృణధాన్యాలు, నూనెగింజలు, పత్తి సాగు పెంచాలని, మొక్కజొన్న ఉత్పత్తి పరిశ్రమలను జిల్లాలో ప్రోత్సహించాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు...