పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీలు చేసిన మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్

షాద్‌నగర్, జూన్ 15 (చైతన్యగళం): వర్షాకాలంలో పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం తెల్లవారు జామున 4:30 గంటలకే ఆయన స్వయంగా రంగంలోకి దిగుతూ ఫరూక్‌నగర్, షాద్‌నగర్ పరిధిలోని పలు కాలనీలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.వర్షాకాలం నేపథ్యంలో మురుగునీటి పారుదల సక్రమంగా జరిగేలా చూడాలని, డ్రైనేజీల్లో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని పరిశుద్ధ కార్మికులకు సూచించారు. ఈ వర్షాకాలం మొత్తం పారిశుద్ధ్య...