మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు
విజయవాడ, జూన్ 14(చైతన్యగళం): మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాని ఆరోపణలకు దీటుగా కౌంటర్ ఇచ్చిన చిన్ని.. ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. కేశినేని నాని బ్యాంకు అధికారులను ప్రలోభపెట్టి ఏకంగా రూ.120 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని.. నాని ఆర్థిక అక్రమాలను ఎండగట్టారు. సాధారణంగా ఎవరైనా బ్యాంకుకు చెల్లించాల్సిన మూడో వాయిదా కట్టకపోతే తక్షణమే ఆస్తులను సీజ్ చేస్తారని,...